ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా.. మ్యాచ్ ఎక్కడ.. ఏ సమయంలో జరుగుతుందంటే..?

Update: 2022-10-30 03:13 GMT

ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో సూపర్ 12 రౌండ్‌లో భారత్ దక్షిణాఫ్రికాతో ఆదివారం, అక్టోబర్ 30న తలపడనుంది. పాకిస్తాన్‌పై సూపర్ విక్టరీని కొట్టి.. భారత్ ICC పురుషుల T20 ప్రపంచ కప్ ప్రయాణాన్ని ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మంచి ఫామ్‌లో కనిపిస్తోంది. ఆప్టస్ స్టేడియం (అధికారికంగా పెర్త్ స్టేడియం)లో జరగాల్సిన ఈ మ్యాచ్ టోర్నమెంట్‌లో భారత్‌కి మూడో మ్యాచ్. ఈ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో పాటు నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా కూడా ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ రద్దు కాగా, బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా భారీ విజయాన్ని సాధించింది. రెండు వరుస విజయాలతో 4 పాయింట్లతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. దక్షిణాఫ్రికా జట్టుకు 3 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్-టాపర్స్‌గా నిలవడానికి, సెమీ-ఫైనల్‌కు వెళ్లడానికి ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్ ప్రోటీస్‌ను ఓడించాలి.

భారతదేశం-దక్షిణాఫ్రికా మధ్య T20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆదివారం, అక్టోబర్ 30, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి ఆస్ట్రేలియాలోని బర్స్‌వుడ్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతుంది. కాయిన్ టాస్ మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు మొదలుకానుంది. భారత్ vs దక్షిణాఫ్రికా T20 మ్యాచ్ Disney+ Hotstarలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ(c), KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, హర్షల్ పటేల్ , యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(c), రిలీ రోసౌవ్, ఐడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ, లుంగీ న్గిడి, హెన్రిచ్ క్లాసే, మార్కో జాన్సెన్, రీజా హెండ్రిక్స్


Tags:    

Similar News