అవకాశాన్ని కోల్పోయిన ఇంగ్లండ్.. విజయం దిశగా భారత్!!

రాంచీ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. టీమిండియా స్పిన్నర్లు

Update: 2024-02-25 12:11 GMT

రాంచీ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ 5, కుల్దీప్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. జడేజాకు 1 వికెట్ దక్కింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే 60, బెయిర్ స్టో 30 పరుగులు చేశారు. 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 24, యశస్వి జైస్వాల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 152 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా... టీమిండియా 307 పరుగులకు ఆలౌట్ అయింది. అందివచ్చిన లీడ్ ను సద్వినియోగం చేసుకోవడంలో ఇంగ్లండ్ ఘోరంగా విఫలమైంది. కీలకమైన 46 పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాత చతికిలపడింది.

ఓవర్ నైట్ స్కోరు 219/7 తో మూడో రోజు ఆట కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ సెంచరీ చేజార్చుకున్నాడు. 149 బంతులు ఎదుర్కొన్న జురెల్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 73, కెప్టెన్ రోహిత్ శర్మ 2, గిల్ 38, రజత్ పాటిదార్ 17, జడేజా 12, సర్ఫరాజ్ ఖాన్ 14, కుల్దీప్ యాదవ్ 28 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ 5 వికెట్లు తీశాడు.


Tags:    

Similar News