Asia Cup : ఓడిన తర్వాత కూడా పాక్ కు బుద్ధిరాలేదుగా?
ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్ తో గెలిచిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్ తో గెలిచిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి రెండోసారి టి20 టైటిల్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. భారత జట్టు ప్రవర్తనపై సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ ఆటగాళ్లు తమ జట్టుతో హ్యాండ్‌షేక్ చేయకపోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని సల్మాన్ విమర్శించారు. తమకు హ్యాండ్‌షేక్ చేయకపోవడం ద్వారా అవమానం కలిగించలేదని, అది క్రికెట్‌కే అవమానమని, మంచి జట్లు ఇలాచేయవని సల్మాన్ వ్యాఖ్యానించారు.
ట్రోఫీ కూడా తీసుకోకుండా...
అలాగే ట్రోఫీతో ఫొటో కోసం భారత ఆటగాళ్లు ముందుకు రాకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ బాధ్యతను నెరవేర్చామని,. మెడల్స్ తీసుకున్నామని, కానీ వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సల్మాన్ అన్నారు. సూర్యకుమార్ యాదవ్‌తో వ్యక్తిగతంగా షేక్ హ్యాండ్ జరిగినప్పటికీ, ప్రజల్లో మాత్రం దాన్ని పాటించలేదని సల్మాన్ ఆరోపించారు. పోటీ మొదలుకాకముందు ప్రెస్ మీట్‌లో, రిఫరీ మీటింగ్‌లో హ్యాండ్‌షేక్ చేశాడని, కానీ కెమెరా ముందు మాత్రం చేయలేదని సల్మాన్ చెప్పారు. అతనికి సూచనలు ఇచ్చినట్లు అనిపిస్తోందనిలేకపోతే అతను తప్పక హ్యాండ్‌షేక్ చేసేవాడని అన్నారు.
భావితరానికి....
అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోషిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారని, అందుకే ఆయనే మైదానంలో నిలబడి తీసుకెళ్లారని సల్మాన్ వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనలు చిన్నారులపై చెడు ప్రభావం చూపుతాయని సల్మాన్ హెచ్చరించారు. తాను కేవలం పాక్ కెప్టెన్ మాత్రమే కాదు, ఒక క్రికెట్ అభిమానిని కూడా అని, భావితరందీనిని చూసి నేర్చుకునే అవకాశముందని, ఇలాంటివి జరుగితే తప్పుడు సందేశం ఇచ్చినట్లవుతుందని అన్నారు. చివరగా, ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మొత్తం పాక్ జట్టు మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తామని సల్మానఆఘా ప్రకటించారు.