రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

జూలై 1న ప్రారంభమైన టెస్ట్ కు ముందు రోహిత్ కు మూడుసార్లు కరోనా పరీక్షలు చేసినా.. కరోనా పాజిటివ్ వచ్చాడు.

Update: 2022-07-04 10:34 GMT

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రోహిత్ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షలో రోహిత్ కు నెగెటివ్ వచ్చింది. దీంతో ప్రాక్టీస్ కోసం రోహిత్ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. భారీ షాట్లతో పాటు, డిఫెన్సివ్ షాట్లను రోహిత్ ప్రాక్టిస్ చేశాడు. రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. కరోనా నుంచి నుంచి కోలుకున్న రోహిత్ శర్మ నెట్స్ లో ఉన్నాడని బీసీసీఐ చెప్పింది. లీసెష్టర్ షైర్ తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో రోహిత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ బ్యాటింగ్ కు దిగలేదు. కరోనా నుంచి కోలుకోవడంతో ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్ తో జరిగే తొలి టీ20కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ తో మూడు టీ20లు, మూడు వన్డేలను టీమిండియా ఆడబోతోంది.

కరోనా పాజిటివ్ రావడంతో రోహిత్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదవ టెస్ట్‌కు దూరమయ్యాడు. తాజాగా రోహిత్ కు నెగెటివ్ రావడంతో.. మెడికల్ ప్రోటోకాల్‌ల ప్రకారం క్వారంటైన్ నుండి బయటకు వచ్చాడు. అయితే రోహిత్ నార్తాంప్టన్‌షైర్‌తో జరిగే T20 వార్మప్ గేమ్‌ లో ఆడలేదు. మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం, కోవిడ్-19 తర్వాత వారి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తనిఖీ చేయడానికి క్వారంటైన్‌లో లేని ఏ ఆటగాడైనా తప్పనిసరిగా కార్డియోవాస్కులర్ పరీక్షలు చేయించుకోవాలి.
జూలై 1న ప్రారంభమైన టెస్ట్ కు ముందు రోహిత్ కు మూడుసార్లు కరోనా పరీక్షలు చేసినా.. కరోనా పాజిటివ్ వచ్చాడు. దీంతో భారత్‌కు జస్‌ప్రీత్ బుమ్రాను కొత్త కెప్టెన్‌ గా నియమించారు. వైట్ బాల్ సిరీస్‌లో రోహిత్ మొదటి గేమ్ నుండి ఆడనుండగా, విరాట్ కోహ్లీ, బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు రెండో గేమ్ నుండి అందుబాటులో ఉంటారు. జూలై 5న టెస్టు ముగిసిన రెండు రోజుల తర్వాత, మొదటి టీ20 జూలై 7న ప్రారంభమవుతుంది.


Tags:    

Similar News