Asia Cup : ఆసియా కప్ ఛాంపియన్ భారత్.. చిత్తుగా ఓడిన పాక్.. గెలుపునకు హైదరాబాదీయే కారణం

దుబాయ్ లోనిన్న జరిగిన ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది

Update: 2025-09-29 01:59 GMT

ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ ను చిత్తుగా ఈ టోర్నోలో మూడోసారి ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంలో మన హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ కీలకంగా మారడం విశేషం. ఆసియా కప్ లో భారత్ అస్సలు ఓటమి అనేది లేకుండా ముగించేసింది. దాయాదిని మూడుసార్లు ఈ టోర్నీలో చిత్తుగా ఓడించింది. టీం ఇండియా అంటే టీ 20లలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా.. ఒకరు కాకుంటే.. మరొకరు... వాళ్లు కాకుంటే... ఇంకొకరు... మ్యాచ్ ను తమ వైపునకు తిప్పుకుంటారని ప్రత్యర్థికి తెలియజేసింది. దుబాయ్ లోనిన్న జరిగిన ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది సగర్వంగా ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో మన హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ నిలబడి భారత్ ను గెలిపించాడు.

తొలుత బ్యాటింగ్ చేసి...
ఎన్ని రెచ్చగొట్టి మాటలు అన్నా.. పాక్ కవ్వింపు చర్యలకు దిగినా తమ పని ఆడటమే అన్న ధ్యేయంగా టీం ఇండియా ముందుకు వెళ్ళింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ లో అదరగొడుతుందని భావించినా కేవలం 146 పరుగులకే పరిమితం చేయగలిగింది. పాక్ ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ లు నిలదొక్కుకోవడంతో ఒక దశలో రెండు వందలకు పైగా పరుగులు చేస్తుందనుకున్నారు. కానీ ఫర్హాన్ ను 57 పరగుుల వద్ద వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ఫకర్ జమాన్ ను నలభై ఆరు పరుగులకే పరిమితం చేశాడు. సైమ్ ఆయూబ్ పథ్నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. హఆరిస్ డకౌట్ అయ్యాడు. సల్మన్ ఆఘా ఎనిమిది పరుగులకు, తలాత్ ఒకటి, నవాజ్ ఆరు, షషీన్ ఆఫ్రిది జీరో, ఆష్రాఫ్ జీరో.. రవూఫ్ ఆరు పరుగులకే అవుట్ అవ్వడంతో 19.1 ఓవర్లలోనే అన్ని వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ 146 పరుగులు మాత్రమే చేసింది.
వరసగా వికెట్లు పడినా...
భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ రెండు, కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి పాక్ పతనానికి కారణమయ్యారు. నిజానికి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలాన్ని చూసి ఉఫ్ అని ఊదేస్తారనుకున్నారు. కానీ ఇరవై ఓవర్లకే మూడు వికెట్లు పడ్డాయి. అభిషేక్ శర్మ ఐదు పరుగులకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సూర్య కేవలం ఒక పరుగు చేసి నిరాశపర్చాడు. శుభమన్ గిల్ పన్నెండు పరుగులు చేసి షాక్ కు గురి చేశాడు. దీంతో తర్వత ఒత్తిడిలో వచ్చిన హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ శాంసన్ తో కలసి మ్యాచ్ ను భారత్ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. శాంసన్ 24 పరుగులు వద్ద అవుట్ కావడంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడినట్లయింది. శివమ్ దూబె 33 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 69 పరుగులు చేసి భారత్ ను విజయం వైపు నడిపించాడు. రింకూసింగ్ ఫోర్ కొట్టి భారత్ కు ఆసియా కప్ ను తొమ్మిదో సారి దక్కేలా చేయగలిగాడు. మొత్తం మీద మాతో పెట్టుకుంటే? అన్నట్లు భారత్ ఇన్నింగ్స్ సాగింది.
Tags:    

Similar News