Asia Cup : మరోసారి దాయాదితో పోరు.. ఆసియా కప్ లో ఆదివారం మజా

ఆసియా కప్ లో మరోసారి భారత్ - పాకిస్తాన్ లు దుబాయ్ లో తలపడనున్నాయి.

Update: 2025-09-26 02:03 GMT

ఆసియా కప్ లో మరోసారి భారత్ - పాకిస్తాన్ లు దుబాయ్ లో తలపడనున్నాయి. ఆసియా కప్ లో ఇప్పటికే రెండు సార్లు భారత్ పాకిస్తాన్ పై విజయం సాధించింది. అయితే మరోసారి ఫైనల్ లో పాకిస్తాన్ పై తలపడనుంది. ఈ పోరు దుబాయ్ వేదికగా జరగనుంది. భారత్ - పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ అంటే ఆద్యంతం ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. ఇప్పటి వరకూ టీ20 ఫార్మాట్ లలో భారత్ దే పై చేయిగా నిలిచింది. అయితే నిన్న బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ విజయం సాధించడంతో మరొకసారి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది.

మరోసారి రెండు జట్ల మధ్య...
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటే నే మజా ఉంటుంది. మరే దేశంతో జరుగుతున్నప్పటికీ ఇంతటి కిక్ ఉండదు. అందుకే ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ ల మధ్య పోరు అంటేనే మళ్లీ సవాళ్లు - ప్రతి సవాళ్లు ఉంటాయి. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఏ మ్యాచ్ లోనైనా భారత్ పై ఏ మాత్రం పాకిస్తాన్ ఆటగాళ్లు రాణించలేకపోయారు. మొదటి మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించగా, సూపర్ 4 మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించుకుంది.
రెండు జట్లు...
ఇక ఆదివారం మరోసారి భారత్ - పాకిస్తాన్ లు తలపడనున్నాయి. దాయాది దేశాల మధ్య పోరు కోసం ప్రపంచంలోని భారతీయులందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ గణాంకాలు పరిశీలించినప్పటికీ భారత్ కు ఎదురొడ్డి నిలబడటం ఏ దేశ జట్టుకు సాధ్యం కాలేదు. బ్యాటింగ్, బౌలింగ్ లో సరైన సమయంలో మంచి పెర్ ఫెర్మాన్స్ చూపిస్తూ భారత్ దూసుకు వెళుతుంది. ఈ ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్స్ కోసం భారత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.





Tags:    

Similar News