తొలి టీ 20 భారత్ దే

వెస్టిండీస్ పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ తొలి టీ 20లో కూడా అద్భుతమైన విజయం సాధించింది

Update: 2022-07-30 02:16 GMT

వెస్టిండీస్ పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ తొలి టీ 20లో కూడా అద్భుతమైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఆరు వికెట్లను కోల్పోయింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 64 పరుగులు చేసి రాణించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, జడేజాలు రాణించలేకపోయినా దినేష్ కార్తిక్ మరోసారి సత్తా చాటాడు. కేవలం 19 బంతుల్లో 41 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ జట్టును 190 పరుగులకు చేర్చడంలో సక్సెస్ అయ్యాడు. దినేష్ కార్తీక్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు.

డీకే భారీ షాట్స్ తో...
అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమయింది. ప్రతి భారత్ బౌలర్ రాణించారు. అందులో బ్రూక్స్ ఒక్కడే 20 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లు అర్షదీప్ సింగ్ రెండు, రవి బిష్ణోయ్ రెండు, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీసి వెస్టిండీస్ ను చావు దెబ్బతీశారు. దీంతో 68 పరుగుల తేడాతో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డీకే ఆట తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెల్లువెత్తున్నాయి.


Tags:    

Similar News