బుమ్రా కెప్టెన్.. పంత్ వైస్ కెప్టెన్

జులై 1 నుంచి ఇంగ్లండ్ తో జరిగే టెస్టులో టీమిండియాకు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Update: 2022-06-30 15:23 GMT

జులై 1 నుంచి ఇంగ్లండ్ తో జరిగే టెస్టులో టీమిండియాకు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కరోనా బారినపడిన రోహిత్ శర్మ కోలుకోకపోవడంతో సెలెక్టర్లు బుమ్రాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం లభించడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని బుమ్రా తెలిపాడు. ఈ ఉదయం జట్టు సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారని, ఇవాళ కూడా రోహిత్ శర్మకు పాజిటివ్ వచ్చిందని వెల్లడించాడు. కెప్టెన్సీ చేపట్టాలంటూ తనకు సమాచారం అందిందని బుమ్రా వివరించాడు.

ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తారని బీసీసీఐ గురువారం ప్రకటించింది, 35 ఏళ్లలో భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. బుధవారం రెండోసారి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ్యాచ్‌కు దూరమయ్యాడు. భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన చివరి పేసర్ కపిల్ దేవ్. అతను చివరిసారిగా 1987లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పటి నుండి టెస్టు క్రికెట్‌లో భారత్ జట్టుకి నాయకత్వం వహించే ఫాస్ట్ బౌలర్ భారత్‌కు ఎప్పుడూ రాలేదు. 1932లో దేశం తొలిసారి ఆడినప్పటి నుంచి భారత్‌కు టెస్ట్ ఫార్మాట్‌లో నాయకత్వం వహించిన 36వ క్రికెటర్ బుమ్రా. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. విజయం సాధించినా లేదా డ్రా అయినా భారత్ సిరీస్ ను సొంతం చేసుకోనుంది.


Tags:    

Similar News