Yashaswi Jaishwal : నాయనా... జైశ్వాల్.. దూకుడుగానే ఉండు కానీ.. త్వరగా అవుట్ కావద్దు ప్లీజ్

టీ 20 చూస్తుంటే యశస్వి జైశ్వాల్ ఎంత సేపు ఉంటే అంత స్కోరు బోర్డు వేగంగా పరుగులు తీస్తుంది.

Update: 2023-12-10 05:10 GMT

టీ 20 చూస్తుంటే యశస్వి జైశ్వాల్ ఎంత సేపు ఉంటే అంత స్కోరు బోర్డు వేగంగా పరుగులు తీస్తుంది. ఫోర్లు, సిక్సర్లు ఒకటేమిటి... చూడాల్సిన షాట్లన్నీ చూసే వీలుంటుంది. చిన్న వయసులోనే తన స్వశక్తితో టీం ఇండియాలోకి అడుగుపెట్టిన జైశ్వాల్ తొలుత ఐపీఎల్ లో రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ లో ఒక మెరుపులా వచ్చి టీం ఇండియాలో పాతుకుపోయాడనే చెప్పాలి. అయితే యశస్వి జైశ్వాల్ కు మెరుపు అని పేరు పెట్టవచ్చు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడంతే. ఉన్నాడంటే ఉతికి పారేస్తాడు. బౌలర్ ఎవరన్నది చూడడు. బంతి ఎంత వేగంగా వస్తుందన్నది అస్సలు చూడనే చూడడు. తాను కొట్టదలచుకున్న షాట్ ను కొట్టి చూపిస్తాడు.

చురుకుదనం చూసి...
రాజస్థాన్ రాయల్స్ లో ఈ కుర్రోడి చురుకుదనం చూసి అంతర్జాతీయ క్రికెటర్లే ముక్కున వేలేసుకున్నారు. ఇవేం షాట్లురా బాబూ అంటూ నోరెళ్ల బెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే మనోడికి ఒకటే మైనస్. వేగంగా ఎంత ఆడతాడో.. అతే స్పీడ్ తో పెవిలియన్ బాట పడతాడు. హాఫ్ సెంచరీ చేసినా అంతే... తక్కువ బాల్స్ లో ఎక్కువ స్కోరు చేయగల చేవ ఉంది జైశ్వాల్ కు. అందుకే యశస్వి ఆటను గమనించిన ప్రత్యర్థులు త్వరగా అవుట్ చేయాలని బౌలర్లను మార్చి మార్చి ప్రయోగాలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కుర్రోడు కావడంతో కొద్దిగా దూకుడు ఎక్కువే. తాను రికార్డుల కోసం వెయిట్ చేయడు. 48 పరుగుల వద్ద కూడా సిక్సర్ బాదేందుకు ప్రయత్నిస్తాడు.
రికార్డులు మాత్రం...
అందుకే యశస్వి జైశ్వాల్ పేరు టీ20 లలో మారు మోగుతున్నప్పటికీ అతని వ్యక్తిగత స్కోరు బోర్డు మాత్రం పెద్దగా కనపించదు. దానికి కారణం దూకుడుతనమేనంటారు. అయితే దూకుడుగా ఉంటూనే జాగ్రత్తగా ఆడుతూ కొంత స్టాండ్ అయ్యే వరకూ నిలదొక్కుకుని ఆ తర్వాత బాదడం మొదలు పెడితే రికార్డులు కూడా సొంతంఅవుతాయన్నది అందరి భావన. ఈరోజు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో మనోడు ఓపెనర్ గా దిగుతున్నాడు. అయితే యశస్వి మీద ఇండియన్ ఫ్యాన్స్ కు ఎన్నో ఆశలున్నాయి. అవన్నీ పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకోబోయే ఆటగాడు యశస్వి కావడంతోనే ఈ భయమంతా. ఈ రోజు మ్యాచ్ లోనైనా నిలకడతనం చూపి వీర బాదుడు బాది ఇండియా ఓపెనర్ గా తన సత్తాను మరోసారి చాటాలని కోరుకోవడంలో తప్పులేదుగా.


Tags:    

Similar News