హార్దిక్ పాండ్యా కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రవి శాస్త్రి

హార్దిక్ 2016లో తన ODI అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు అతను కేవలం రెండు యాభై ఓవర్ల ICC ఈవెంట్‌లను మాత్రమే ఆడాడు

Update: 2022-07-24 07:31 GMT

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవల వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వన్డే క్రికెట్ భవిష్యత్తు గురించి చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో టీమిండియా కీలక ఆటగాడు, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను ఉద్దేశించి మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ తర్వాత వన్డేల నుంచి హార్ధిక్ పాండ్యా తప్పుకునే అవకాశం ఉందని అన్నారు. హార్దిక్ వన్డేలను వదిలేసి, టీ20లకే పరిమితమయ్యే అవకాశం ఉందని అన్నారు. భవిష్యత్తులో చాలా మంది ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ కే ప్రాధాన్యతను ఇస్తారని.. వన్డేలు, టీ20ల కంటే టెస్ట్ క్రికెట్ చాలా ప్రత్యేకమైనదైనప్పటికీ... టెస్ట్ క్రికెట్ రోజురోజుకు ఆదరణ కోల్పోతోందని అన్నారు. ఆటగాళ్లు ఏయే ఫార్మాట్లలో ఆడాలో వారే నిర్ణయించుకుంటున్నారని.. హార్ధిక్ విషయానికి వస్తే టీ20 ఆడాలనుకుంటున్నాడని రవి శాస్త్రి అన్నారు.

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా పరిగణిస్తూ ఉన్నారు. అతను జట్టుకు సరైన బ్యాలెన్స్‌ని అందజేస్తాడు. ఇటీవల ముగిసిన ODI సిరీస్‌లో మంచి ప్రదర్శన చేశాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌కు మూడు ఫార్మాట్‌లు ఆడడం చాలా కష్టం. తాజాగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ టీ20, టెస్టులపై దృష్టి సారించేందుకు వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఇదే జరగొచ్చనే ప్రచారం సాగుతూ ఉంది. ఇటీవలే ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఎవరూ ఊహించని విధంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
హార్దిక్ 2016లో తన ODI అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు అతను కేవలం రెండు యాభై ఓవర్ల ICC ఈవెంట్‌లను మాత్రమే ఆడాడు. ICC 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.. ICC 2019 వరల్డ్ కప్ ఆడాడు. హార్దిక్ 66 వన్డేల్లో 33.80 సగటుతో 115 స్ట్రైక్ రేట్‌తో 1,386 పరుగులు చేశాడు.


Tags:    

Similar News