పంత్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?

ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు

Update: 2022-12-31 13:11 GMT

ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కుడి కాలు లిగ్మెంట్ పక్కకు తొలగడంతో కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. కొత్త సంవత్సరం పంత్ క్రికెట్ ఆడేది కష్టమేనని చెబుతన్నారు. 2023 సంవత్సరం రిషబ్ కు కలసి రాలేదని ఆయన అభిమానులు వాపోతున్నారు. కాగా రిషబ్ పంత్ కు ప్లాస్టిక్ సర్జరీని కూడా నిర్వహించారు. ఆయన ముఖం మీద గాయాలు కావడంతో ఈ సర్జరీని నిర్వహించామని తెలిపారు.

ప్లాస్టిక్ సర్జరీ పూర్తి...
డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలోనే శస్త్ర చికిత్స చేశారు. తొలుత ఢిల్లీకి తరలించాలని భావించినప్పటికీ అక్కడే ఆపరేషన నిర్వహించారు. బీసీసీఐ ఎప్పటికప్పడు పంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటుంది. పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పంత్ వైద్యానికయ్యే ఖర్చు మొత్తాన్ని బీసీసీఐ భరిస్తుందని తెలిపారు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రముఖ బాలివుడ్ నటులు అనుపమ ఖేర్, అనిల్ కపూర్ లు ఆసుపత్రికి వెళ్లి పంత్ ను పరామర్శించారు.


Tags:    

Similar News