కీలక సిరీస్.. గిల్ కు సచిన్ సలహా ఇదే

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్ ట్రోఫీకి దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్

Update: 2025-06-20 10:48 GMT

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్ ట్రోఫీకి దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, జేమ్స్ ఆండర్సన్‌ల పేర్లను పెట్టారు. ఇప్పటివరకు పటౌడీ ట్రోఫీగా పిలుస్తుండగా, ఇకపై 'ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ'గా ఉండనుంది.

ఇక భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మన్‌ గిల్‌ పగ్గాలు చేపట్టాడు. అయితే గిల్ కు కుదురుకోవడానికి సమయం ఇవ్వాలని సచిన్‌ అభిప్రాయపడ్డారు. శుభ్‌మన్‌ ఎవరి మాటలు వినకుండా, తన సొంత ప్రణాళికతో ముందుకు సాగాలని సలహా ఇచ్చారు. శుభ్‌మన్‌కు అందరూ మద్దతుగా నిలవాలని, ఒక ఆటగాడు జట్టు సారథిగా ఎంపికైనప్పుడు ఇలా చేయి.. అలా చేయొద్దని సలహాలు ఇస్తుంటారన్నారు సచిన్. డ్రెస్సింగ్‌ రూమ్‌ అవతల నుంచి వచ్చే సలహాల గురించి గిల్‌ ఎక్కువగా పట్టించుకోకూడదని, సొంత ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు సచిన్. డ్రెస్సింగ్‌రూమ్‌లో చర్చలకు తగ్గట్టుగా టీమ్‌ ఆడుతుందో లేదో గమనించాలని, బయట మాటలకు ప్రభావితం కాకుండా ఏ నిర్ణయమైనా టీమ్ కోసం తీసుకోవాలని సూచించారు సచిన్.

Tags:    

Similar News