ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో క‌రోనా క‌ల‌క‌లం.. ఏడుగురు షట్లర్లకు కోవిడ్

మ్యాచ్ నిర్వహించే ముందు ఆటగాళ్లందరికీ కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా.. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్ గా

Update: 2022-01-13 07:32 GMT

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కరోనా కలకలం రేపుతోంది. రెండ్రోజుల క్రితమే ఈ టోర్నీ ప్రారంభమవ్వగా.. నేడు రెండో దశ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. మ్యాచ్ నిర్వహించే ముందు ఆటగాళ్లందరికీ కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా.. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ మేరకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఓ ప్రకటన చేసింది.

కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్ థక్కర్, ట్రెస్సా జోలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమాన్ సింఘీ, కుషి గుప్తాలకు కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో.. వారందరినీ ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడుగురు షట్ల‌ర్ల‌ డబుల్స్‌ పార్ట్‌నర్ల‌ను కూడా టోర్నీ నుంచి నిష్క్ర‌మింప‌జేసిన‌ట్లు బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. వారందరినీ తదుపరి రౌండ్లకు ప్రమోట్ చేసింది. కాగా.. కేవలం భారత షట్లర్లే కాకుండా.. ఇంగ్లాండ్ కు చెందిన ఇద్దరు క్రీడాకారులకు కూడా కోవిడ్ సోకగా.. జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో టోర్నీ నిర్వహణపై పలు అనుమానాలు వస్తున్నాయి.



Tags:    

Similar News