ఫార్ములా ఈ రేస్ కు సచిన్

ఫార్ములా ఈ రేస్ లను చూసేందుకు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. క్రికెటర్లతో పాటు సినీ హీరోలు నెక్లెస్ రోడ్డులో సందడి చేస్తున్నారు.

Update: 2023-02-11 07:27 GMT

ఫార్ములా ఈ రేస్ లను చూసేందుకు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. క్రికెటర్లతో పాటు సినీ హీరోలు నెక్లెస్ రోడ్డులో సందడి చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యేకంగా ఈ ఫార్ములా రేస్ ను చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. క్రికెటర్లు యజ్వేంద్ర చాహల్, దీపక్ హుడాలు ఫార్ములా ఈ రేస్ ను చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. అలాగే మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్ కూడా ఫార్ములా రేస్ ను చూసేందుకు వచ్చారు.

క్రికెటర్లు, సినీతారలతో...
వీరితో పాటు మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుండటంతో సినీతారలు, క్రికెటర్లు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన క్రికెటర్లు, సినీ తారలను చూసేందుకు అక్కడ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మొత్తం మీద హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ ల వద్ద భారీగా అభిమానులు కూడారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News