వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం నజరానా

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నగదు బహుమతిని ప్రకటించారు

Update: 2025-04-29 12:17 GMT

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నగదు బహుమతిని ప్రకటించారు. పథ్నాలుగేళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడి సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ భారత్ కు భవిష్యత్ ఆటగాడిగా ఎక్స్ లో నితీష్ కుమార్ అభివర్ణించారు. దీంతో బీహార్ ప్రభుత్వం వైభవ్ సూర్యవంశీకి పది లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.

నగదు బహుమతిగా...
ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ కి అభినందనలు అని నితీష్ కుమార్ పేర్కొన్నారు. తన కృషితో మరిన్ని రికార్డులను బద్దలు చేసి క్రికెట్ భారత్ కు మరింత పేరు తేవాలని నితీష్ కుమార్ ఆకాంక్షించారు. బీహార్ ప్రజలు వైభవ్ సూర్యవంశీ ఆటను చూసి గర్వపడుతున్నారని, మరిన్ని విజయాలను అందుకోవాలని నితీష్ కుమార్ ట్విట్టర్ లో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2024లో తనను కలిసిన ఫొటోను నితీష్ కుమార్ షేర్ చేశారు.


Tags:    

Similar News