పహాల్గాం ఎఫెక్ట్ తో భారత్ - పాక్ క్రికెట్ పై నిర్ణయం
పహాల్గాం దాడి తో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో ఇక క్రికెట్ మ్యాచ్ లు భారత్ ఆడబోదని తేల్చి చెప్పింది
పహాల్గాం దాడి తో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో ఇక క్రికెట్ మ్యాచ్ లు భారత్ ఆడబోదని తేల్చి చెప్పింది. ద్వైపాక్షిక సిరీస్ ఇకపై ఉండబోవని కూడా స్పష్టం చేసింది. భవిష్యత్ లో పాక్ తో ఎలాంటి సిరీస్ ను ఆడబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రకటించారు. అయితే భారత్ - పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఉంటే బాగుంటుందని అనేక సూచనలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ పహల్గాం ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసకుంది.
ద్వైపాక్షిక సిరీస్ ను...
కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామని, ఇప్పటికే ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ ను ఆడటం లేదని, ఇకముందు కూడా ఆడబోమని రాజీవ్ శుక్లా ప్రకటించారు. దేశంలో జరిగిన దానిపై ఐసీసీకి పూర్తి అవగాహన ఉంటుందని తాము అనుకుంటున్నామని రాజీవ్ శుక్లా అనడంతో ఇకపై భారత్ - పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ లు ఉండబోవని తేలింది. నిజానికి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ 2012 నుంచి జరగడం లేదు. ఇప్పుడ పహాల్గాం ఘటనతో దీనిని ఇక భవిష్యత్ లోనూ కొనసాగిస్తామని తేల్చి చెప్పినట్లయింది.