బీసీసీఐ కీలక నిర్ణయం - ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లో ఇక జరగబోయే మ్యాచ్ లన్నీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది
IPL matches
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లో ఇక జరగబోయే మ్యాచ్ లన్నీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ లో ఇంకా పన్నెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.
భధ్రతపై అనుమానాలు...
వీటిని నిర్వహించడానికి అవసరమైన భద్రతపై అనేక అనుమానాలు తలెత్తాయి. అందుకే నిన్న పాక్ భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో దాడులకు దిగడంతో ధర్మశాలతో జరుగుతున్న ఢిల్లీ కాపిటల్స్ తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రద్దయింది. తాజాగా బీసీసీఐ అత్యవసర సమావేశమై ఇక జరగబోయే మ్యాచ్ లన్నింటినీ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.