కివీస్ మీద బంగ్లాదేశ్ సంచలన విజయం

న్యూజిలాండ్ జట్టు మీద బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయం సాధించింది

Update: 2023-12-23 06:44 GMT

Bangladesh historic win

న్యూజిలాండ్ జట్టు మీద బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయం సాధించింది. కివీస్ ను సొంతగడ్డపై 100 పరుగుల లోపు ఆలౌట్ చేసి.. అది కూడా ఛేజ్ చేసి న్యూజి లాండ్ గడ్డపై వన్డేల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 99 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ ఆరంభంలోనే రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగినా.. అనామల్ హక్, శాంటో భారీ భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ కు విజయాన్ని అందించారు. శాంటో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే, హక్ 37 పరుగులు చేసాడు. కివీస్ బౌలర్లలో విలియం రోర్క్ కు ఒక వికెట్ దక్కింది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ కేవలం 98 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి కివీస్ ను ఒత్తిడిలో పడేసారు. షోరిఫుల్ ఇస్లాం, షకీబ్, సౌమ్య సర్కార్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. ముస్తాఫిజార్ కు ఒక వికెట్ దక్కింది. కివీస్ జట్టులో విల్ యంగ్ 26 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు వన్డేలు న్యూజిలాండ్ గెలిచింది.. ఆఖరి వన్డేలో బంగ్లాదేశ్ విజయం అందుకుంది. విల్ యంగ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.



Tags:    

Similar News