టాస్ గెలిచిన ఐర్లాండ్.. మరో సంచలనం సృష్టించేనా..?

Update: 2022-10-31 07:56 GMT

టీ20 వరల్డ్ కప్ 2022లో ఆస్ట్రేలియా ఐర్లాండ్ తో తలపడనుంది. ఈరోజు టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. బ్రిస్బేన్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తుందో.. ఆ జట్టు సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూపర్-12 రౌండ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడాయి. ఇరు జట్లకు తలో 3 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ పరంగా ఐర్లాండ్ స్థానం మెరుగ్గా ఉంది. ఇక 6 జట్ల గ్రూప్-1లో ఐర్లాండ్ మూడో స్థానంలో, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉన్నాయి. T20 ప్రపంచ కప్ 2022 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆ తర్వాత శ్రీలంక పై గెలిచింది. వర్షం కారణంగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్ రద్దైంది.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్
ఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(సి), లోర్కాన్ టక్కర్(w), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, ఫియోన్ హ్యాండ్, జాషువా లిటిల్


Tags:    

Similar News