భారత్-పాక్‌ హై వోల్టేజ్ మ్యాచ్‌.. నేటి నుంచే టిక్కెట్ల విక్రయం

ఆసియా కప్ 2023 వ‌న్డే ఫార్మాట్ హైబ్రిడ్ మోడల్‌లో జ‌రుగ‌నుంది. ఈ టోర్నీ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది.

Update: 2023-08-17 04:40 GMT

ఆసియా కప్ 2023 వ‌న్డే ఫార్మాట్ హైబ్రిడ్ మోడల్‌లో జ‌రుగ‌నుంది. ఈ టోర్నీ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడనున్నాయి. ఈ నేప‌థ్యంలో క్రికెట్ అభిమానులకు శుభవార్త వచ్చింది. పీసీబీ టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి పీసీబీ ప్రకటించింది.

ఆసియా కప్ 2023లో భారత్ తన మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో ఆడనుంది. భారత్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఈ క్రమంలో నేటి నుంచి శ్రీలంకలో జరిగే భార‌త్‌ మ్యాచ్‌ల టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బుధవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆసియా కప్ మ్యాచ్‌ల టిక్కెట్లు pcb.bookme.pkలో అందుబాటులో ఉంటాయి.

సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్‌కు నేటి నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. మొద‌ట ద‌శ టిక్కెట్ల విక్రయం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో శ్రీలంకలో జరిగే మ్యాచ్‌ల రెండో దశ టికెట్ల విక్రయాలు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 2న పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

పీసీబీ ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఐడీ-పాస్‌పోర్ట్‌పై గరిష్టంగా నాలుగు టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే.. భారత్‌-పాక్ మధ్య మ్యాచ్‌కు ఒక ఐడీ-పాస్‌పోర్ట్‌పై గరిష్టంగా రెండు వికెట్లు కొనుగోలు చేయవచ్చు. హాస్పిటాలిటీ బాక్స్ నుండి మ్యాచ్‌ని చూడాలనుకునే వారు తమ ఈ-మెయిల్‌ను Ticketing@pcb.com.pkకి పంపవచ్చు.

అయితే.. పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయం ఇటీవల ప్రారంభమైంది. ఆగస్టు 30న పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌లో 4 నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్‌తో సహా మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.


Tags:    

Similar News