వైజాగ్ వేదికగా మరో మ్యాచ్
భారత మహిళల జట్టు విశాఖపట్నం వేదికగా మరో పోరుకు సిద్ధమైంది
భారత మహిళల జట్టు విశాఖపట్నం వేదికగా మరో పోరుకు సిద్ధమైంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించగా.. రెండో మ్యాచ్ లోనూ అదే ఫలితం సాధించాలని భారత్ భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారతజట్టు రాణిస్తున్నా ఫీల్డింగ్‌లో మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. గత మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన 20 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్టవి శర్మ ఆటను భారత అభిమానులు గమనించనున్నారు. లంకతో ఆడిన గత పది టీ20ల్లో భారత్ ఎనిమిది గెలిచి పైచేయి సాధించింది. లంక కెప్టెన్ చమరి ఆటపట్టు, ఇతర స్టార్ ఆటగాళ్లు రాణిస్తే భారత్ కు ముప్పు తప్పదు.