అభిషేక్ సాధించిన సరికొత్త రికార్డు
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 172 పరుగులని ఏడు బంతులు మిగిలుండగానే భారత్ ఛేదించింది. అభిషేక్ శర్మ 74 పరుగులు బాదాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో చెలరేగి ఆడాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ సిక్సర్ బాది ఓ రికార్డును సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రెండుసార్లు తొలి బంతికే సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ మరో ప్రపంచ రికార్డు సైతం నెలకొల్పాడు. టీ20ల్లో ఎదుర్కొన్న అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్స్‌లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తం 331 బంతుల్లో అభిషేక్ 50 సిక్స్‌లు బాదాడు. అంతకుముందు వెస్టిండీస్ ఆటగాడు ఈవిన్ లూయిస్ 366 బంతుల్లో ఈ రికార్డు సాధించాడు.