చిక్కుల్లో.. 2007 ప్రపంచ కప్ హీరో జోగిందర్‌ శర్మ

భారత మాజీ క్రికెటర్‌, హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ జోగిందర్‌ శర్మపై కేసు

Update: 2024-01-05 10:46 GMT

హిసార్‌ నివాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ఘటనకు సంబంధించి.. భారత మాజీ క్రికెటర్‌, హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ జోగిందర్‌ శర్మపై కేసు నమోదైంది. జోగిందర్ శర్మ 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన T20 ఫైనల్‌లో కీలకమైన చివరి ఓవర్ బౌలింగ్ వేసిన జోగిందర్ శర్మ హర్యానా పోలీస్‌లో DSP అయ్యాడు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు హర్యానా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అజయ్‌వీర్, ఈశ్వర్ ప్రేమ్, రాజేంద్ర సిహాగ్‌గా గుర్తించిన మరో ఐదుగురి పేర్లు కూడా ఉన్నాయి.

హిస్సార్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి జనవరి 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు జోగిందర్ శర్మ కూడా కారణమన్న ఆరోపణలపై హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు హర్యానా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో జోగిందర్ శర్మతో పాటు అజయ్‌వీర్, ఈశ్వర్ ప్రేమ్, రాజేంద్ర సిహాగ్‌ సహా మరో ఐదుగురి పేర్లు కూడా ఉన్నాయి. ఆస్తి వివాదంపై గతంలో డీఎస్పీగా పనిచేసిన జోగిందర్ శర్మకు మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనపైనా అధికారులు కేసు నమోదు చేశారు. హిస్సార్‌లో నివాసముంటున్న పవన్ జనవరి 1న ఆస్తి తగాదాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు పవన్ తల్లి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆస్తికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉందని చెప్పారు. మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మతో సహా ఆరుగురు వ్యక్తులు తన కుమారుడిని వేధించారని, అందుకే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించింది.
నిందితులను షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. కుటుంబానికి ఆర్థిక సహాయం, కేసుపై న్యాయమైన విచారణ సహా తమ ఆరు డిమాండ్లను కూడా వారు పోలీసుల ముందు ఉంచారు. నిందితుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు మోపామని, దర్యాప్తు తర్వాతే ఎస్సీ/ఎస్టీ సెక్షన్‌ను జోడిస్తామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జోగిందర్ శర్మ ఈ కేసులో తన ప్రమేయం లేదని కొట్టిపారేశారు. "నాకు ఈ కేసు గురించి తెలియదు. పవన్‌ని ఎప్పుడూ కలవలేదు" అని అన్నారు.


Tags:    

Similar News