రాఖీని చేతి నుండి ఎప్పుడు తీసివేయాలి..?

రక్షా బంధన్ ను భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఎంతో ఆనందంతో జరుపుకున్నారు.

Update: 2022-08-12 03:22 GMT

రక్షా బంధన్ ను భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఎంతో ఆనందంతో జరుపుకున్నారు.ప్రాంతాలను బట్టి ఈ పద్దతుల్లో కాస్త మార్పులు ఉన్నా రాఖీ పండుగ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ. ప్రతి అన్నా చెల్లెలూ ఈ పండుగను తమదిగా జరుపుకుంటారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో, సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి అతని శ్రేయస్సును కోరుకుంటూ ఈ రోజున వేడుక చేసుకుంటారు. తన సోదరిని జీవితాంతం రక్షించడం కోసం సోదరుడు చేసే వాగ్దానానికి ప్రతీక ఈ రాఖీ.

దీన్ని ఏ సమయంలో తీయాలి అనేది చాలా మందికి తెలియదు. హిందూ గ్రంధాల ప్రకారం, రాఖీ కట్టడానికి నిర్దిష్ట సమయం లేదు. అతను రాఖీని ఎప్పటి దాకా ధరించాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవడం సోదరుడి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. మహారాష్ట్ర సంస్కృతిలో రక్షా బంధన్ రోజు నుండి 15 రోజుల పాటు సోదరుడు రాఖీని ధరించడం కొనసాగించాలని చెబుతారు. 15వ రోజున మహారాష్ట్రీయులు పోలా అనే పండుగను జరుపుకుంటారు. ఆరోజున ఏదైనా చెట్టుకు తీసివేసిన రాఖీని కట్టాలని చెబుతుంటారు.


Tags:    

Similar News