ఆయుష్మాన్ కార్డు ఉంటే జీవితానికి భరోసా.. కార్డు ఎలా పొందాలంటే?

ఆయుష్మాన్ కార్డు ఉంటే ఉచితంగా ఐదు లక్షల రూపాయల వరకూ వైద్యం అందతుంది

Update: 2026-02-03 05:09 GMT

ఆయుష్మాన్ కార్డు ఉంటే ఉచితంగా ఐదు లక్షల రూపాయల వరకూ వైద్యం అందతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే ఉచిత వైద్యం అందుతుంది. పీఎం జేఏవై ఆయుష్మాన భారత్ పొందాలంటే ఏ ఏ అర్హతలుండాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ కార్డు వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఈ కార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాలసిస్, ఆపరేషన్లు వంటి వాటికి కూడా ఉచితంగా వైద్యం చేయబడుతుంది.

అర్హతలివీ...
ఈ పథకం ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల కోసం ఆయుష్మాన్ కార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.ఒకే గది నివాసాలలో ఉండే కుటుంబాలు, 16 నుండి 59 ఏళ్ల వయస్సు గల పురుషుడు లేని కుటుంబాలు, సొంత భూమి లేని కుటుంబాలు, గృహ కార్మికులు, పారిశుధ్య కార్మికులు, వీధి వ్యాపారులు , డ్రైవర్లు, కండక్టర్లు వంటి రవాణా కార్మికులు, 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ ఆయుష్మాన్ కార్డు పొందడానికి అర్హులే. వీరికి ఏడాదికి ఐదు లక్షల వరకూ ఉచిత వైద్య సహాయం లభిస్తుంది.
దరఖాస్తు చేసుకోవడం ఇలా...
ముందుగా www.pmjay.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి మీ ప్రాథమిక వివరాలతో అర్హత (Eligibility) ఉందో లేదో చెక్ చేసుకోండి. అర్హత ఉంటే, CSC (Common Service Center) లను లేదా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆసుపత్రులను సంప్రదించండి. Aadhaar Card లేదా Ration Card వంటి గుర్తింపు పత్రాలు తప్పనిసరి. పైన చెప్పిన అర్హతలున్న వారు వైద్య సదుపాయాలను ఉచితంగా పొందే వీలుంది. అలాగే ఏ ఆసుపత్రుల్లో ఈ కార్డు చెల్లుబాటు అవుతుందని తెలుసుకోవాలంటే..​PM-JAY Find Hospital వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.​మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకుని సెర్చ్ చేస్తే, ఆ కార్డును అంగీకరించే ఆసుపత్రుల జాబితా కనిపిస్తుంది...
ఈ ఆసుపత్రుల్లో...
ప్రభుత్వ లేదా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో 'ఆరోగ్య మిత్ర' కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ కార్డు చూపిస్తే, వారు దానిని ఎలా ఉపయోగించాలో లేదా దగ్గరలో ఉన్న ఏ ఆసుపత్రికి వెళ్లాలో మార్గదర్శనం చేస్తారు. ఒకవేళ జాబితాలో ఉన్న ఆసుపత్రి కార్డును నిరాకరిస్తే, మీరు ఈ క్రింది మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చుజ
​హెల్ప్‌లైన్ నంబర్: 14555 లేదా 1800-111-565 కు కాల్ చేయండి.
​ఆన్‌లైన్ పోర్టల్: CGRMS Portal ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి.
​UMANG App: ఉమాంగ్ యాప్‌లో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.


Tags:    

Similar News