Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్యం

ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది

Update: 2025-11-22 02:40 GMT

ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఏప్రిల్ నెలలో మరొక గుడ్ న్యూస్ చెప్పనుంది. ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ స్థానంలో ఆరోగ్య బీమాను ప్రతి ఒక్కరికీ అందించాలని చంద్రబాబు ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు మాత్రమే కాకుండా అందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకురానుంది.

ఆర్థిక భారం పడటంతో...
ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కారణంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. కార్పొరేట్ ఆసుపత్రులు కొన్ని నకిలీ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.పేద వాడికి ఆరోగ్యం అందాలంటే బీమా ఒక్కటే మార్గమని భావించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎత్తివేసి దాని స్థానంలో ఆరోగ్య బీమాను ప్రవేశపెడతామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్యంతో పాటు, అత్యంత ఖరీదైన సూపర్ స్పెషాలిటీ సేవలను సైతం పేదలకు ఉచితంగా అందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఖరీదైన వైద్యం ఉచితంగా అందించేందుకు బీమా ద్వారానే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి...
2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రానున్న యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం వర్తించనుంది. దీంతో పేద, ధనిక తారతమ్యం లేకుండా ఆరోగ్య బీమాను అందరూ పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ డిజిటల్ డేటా విశ్లేషణతో కలిసినప్పుడు... రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక పటిష్టమైన పునాది పడుతుంది. ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం, సంజీవని ప్రాజెక్టు అని నమ్ముతున్నారు. కేవలం సాంకేతికత, మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిఆరోగ్య భవిష్యత్తుకు భరోసా ఇవ్వనుంది.


Tags:    

Similar News