కాలేయానికి లైఫ్ ఇచ్చే తులసి-28ఎక్స్
అనారోగ్యంతో కాలేయం దెబ్బతిని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎంతో మందిని ఆసుపత్రుల్లో చూస్తున్నాం.
అనారోగ్యంతో కాలేయం దెబ్బతిని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎంతో మందిని ఆసుపత్రుల్లో చూస్తున్నాం. కాలేయానికి లైఫ్ ఇచ్చే మందును హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆస్పైర్ బయోనెస్ట్, తులసి థెరప్యూటిక్స్ అంకురసంస్థ, నిమ్స్ ఆసుపత్రి వైద్యనిపుణులు, పరిశోధకులు కనుగొన్నారు. కొద్దినెలలుగా జంతువులపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ పరిశోధనలను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘రీ-జనరేటివ్ మెడిసిన్’ ప్రచురించింది. దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నవారికి కాలేయ మార్పిడి చికిత్స మాత్రమే ప్రత్యామ్నాయం కాగా, ఈ మందు కాలేయాన్ని పునరుజ్జీవింపజేయనుందని పరిశోధకులు తెలిపారు. దీనికి ‘తులసి-28ఎక్స్’ అని పేరుపెట్టారు. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాక, రెండేళ్లలో మందును అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.