ప్లీజ్‌.. ప్లీజ్.. ప్లీజ్ అంటే ఇవ్వ‌డానికి తంబాకా ? ల‌వంగ‌మా ?

తెలంగాణ భ‌వన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ... అమిత్ షా తుక్కుగూడ‌కు వ‌చ్చి అన్నీ త‌ప్పు మాట‌లు మాట్లాడార‌ని, ఈ మాట‌లు

Update: 2022-05-15 12:16 GMT

హైదరాబాద్ : తుక్కుగూడ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి కేటీఆర్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ భ‌వన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ... అమిత్ షా తుక్కుగూడ‌కు వ‌చ్చి అన్నీ త‌ప్పు మాట‌లు మాట్లాడార‌ని, ఈ మాట‌లు తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతోంద‌ని అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటీఆర్ ఖండించారు. బీజేపీ నేత‌ల‌కు ముంద‌స్తు ఎన్నిక‌ల ఉబ‌లాటం ఉందేమో కానీ త‌మ‌కు లేద‌న్నారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో స‌రైన స‌మ‌యానికే కేసీఆర్ ఎన్నిక‌ల‌కు వెళ్తార‌ని స్ప‌ష్టం చేశారు. ద‌మ్ముంటే బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటును ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు రావాల‌ని కేటీఆర్ స‌వాల్ విసిరారు.

బీజేపీ ప‌దేప‌దే డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రావాలంటోంద‌ని, అస‌లు డ‌బుల్ స‌ర్కార్‌ ఉన్న రాష్ట్రాల్లో పీకింది ఏందో అక్కడి ప్రజల కష్టాలు చుస్తే తెలుస్తుందని కేటీఆర్ విమ‌ర్శించారు. డ‌బ్బాలా గుల‌క‌రాళ్లు వేసి ఊపితే వ‌చ్చే సౌండ్‌లా మాట్లాడార‌నే కానీ తెలంగాణ‌కు అవ‌స‌ర‌మొయ్యే ఒక్క మాట కూడా అమిత్ షా మాట్లాడ‌లేద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో 108 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ పోగొట్టుకుంద‌ని, ఆ పార్టీకి క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేద‌ని చెప్పారు.
ప్లీజ్‌, ప్లీజ్‌, ప్లీజ్ అని అడిగితే ప్ర‌జ‌లు అధికారం ఇవ్వ‌ర‌ని, ప్లీజ్ అంటే ఇవ్వ‌డానికి అధికారం తంబాకు, ల‌వంగం కాద‌ని బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌ను కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ చైత‌న్య‌వంత‌మైన రాష్ట్ర‌మ‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చి నోటికొచ్చిన్టుల అబ‌ద్ధాలు చేపితే కుద‌ర‌ద‌ని, ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పేర్కొన్నారు. నిజాలు చెప్ప‌డంటంటే బీజేపీ నేత‌లు నిజాం గురించి చెబుతున్నార‌ని విమ‌ర్శించారు.
ఇంకా ఓవైసీ భుజాలపై తుపాకీ పెట్టి ఎన్ని రోజులు కాల్చుతారపి కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఆర్టికల్ 370 ర‌ద్దుకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిని కూడా ఇవ్వలేదని అమిత్ షా అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. వాట్సాప్ యూనివ‌ర్సిటీ ద్వారా అవాస్త‌వాలు ప్రచారం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.


Tags:    

Similar News