YSRCP, TDP : నలభై ఏళ్ల చ‌రిత్రను ఇద్దరూ బ్రేక్ చేయనున్నారా? అదే జరిగితే?

ఏలూరు పార్లమెంటు సీటు విష‌యంలో నాలుగు ద‌శాబ్దాల రికార్డును చంద్రబాబు, జ‌గ‌న్ ఇద్దరూ బ్రేక్ చేయనున్నారు

Update: 2024-02-24 13:45 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచ‌డంతో పాటు అభ్యర్థుల విష‌యంలో శ‌ర‌వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవల ఆరు జాబితాల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు త‌మ పార్టీ అభ్యర్థుల‌ను ప్రక‌టించ‌గా.. చంద్రబాబు కూడా 94 మంది అభ్యర్థుల‌ను ప్రకటించారు. లోక్‌షభ నియోజకవర్గాల సీట్లను మాత్రం ప్రకటించలేదు. అంత‌ర్గత చ‌ర్చల్లో పోటీ చేసే వారికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు పార్లమెంటు సీటు విష‌యంలో నాలుగు ద‌శాబ్దాల రికార్డును చంద్రబాబు, జ‌గ‌న్ ఇద్దరూ బ్రేక్ చేయనున్నారు. ఈ సీటును రెండు పార్టీలు బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ వ‌ర్గానికి కేటాయించనున్నాయి.

పోటీ చేయనని చెప్పడంతో...
వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ ఈసారి తాను పోటీ చేయ‌న‌ని ముందే చెప్పడంతో జ‌గ‌న్ బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన కారుమూరి సునీల్‌ను రంగంలోకి దింపారు. సునీల్ మంత్రి కారుమూరి నాగేశ్వర‌రావు త‌న‌యుడు కావ‌డం విశేషం. ఆయ‌న తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. ఈ పార్లమెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో యాద‌వ క‌మ్యూనిటీ ఓట్లే 1.60ల‌కు పైగా ఉన్నాయి.అందుకే వైఎస్ జగన్ ఏరికోరి యాదవ సామాజికవర్గంతో పాటు ఆర్థికంగా బలమైన నేత సునీల్ కుమార్ ను రంగంలోకి దింపారన్న టాక్ జిల్లాలో బలంగా నడుస్తుంది.
వైసీపీ బీసీ అస్త్రం...
వైసీపీ యాదవ వ‌ర్గం నేత‌ను దింపుతుంద‌ని తెలిసిన టీడీపీ కూడా అలెర్ట్ అయ్యింది.తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఈ 40 ఏళ్లలో ఏలూరు పార్లమెంటు సీటును ఆ పార్టీ ఎప్పుడూ క‌మ్మ వ‌ర్గానికే కేటాయిస్తూ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మాజీ మంత్రి మాగంటి బాబును కాద‌ని చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం కామ‌వ‌ర‌పుకోట మండ‌లం కంఠ‌మ‌నేని వారిగూడెంకు చెందిన ప్రముఖ పారిశ్రామిక‌వేత్త గోరుముచ్చ గోపాల్ యాద‌వ్‌ను రంగంలోకి దించుతోంది. గోరుముచ్చుకు ఆర్థిక వ‌న‌రులు రెడీ చేసుకోవాల‌ని అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతో ఆయ‌న ఆ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. గోపాల్ కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల్లోకి దిగుతున్నారు.
తొలిసారి సీటు...
ఆయ‌న పూర్తిగా రాజ‌కీయాల‌కు కొత్త‌.ఏలూరు పార్లమెంటు సీటును ప్రధాన పార్టీలు బీసీల‌కు ఇదే ఫ‌స్ట్ టైం. టీడీపీ 40 ఏళ్లలో క‌మ్మ సామాజికవర్గాన్ని దాటి వెళ్ల‌లేదు. వైసీపీ రెండు ఎన్నిక‌ల్లోనూ ఓసీల‌కు ఓ సారి కాపు, మ‌రోసారి వెల‌మల‌కు సీటు ఇచ్చింది. ప్రజారాజ్యం మాత్రం 2009లో యాద‌వ వ‌ర్గానికే చెందిర కొలుసు రెడ్డయ్య యాద‌వ్ ( కొలుసు పార్థసార‌థి తండ్రి)కి ఇచ్చింది. ఇక ఇప్పుడు జ‌గ‌న్‌, చంద్రబాబు ఇద్దరూ బీసీల‌కు ఇవ్వడం.. పైగా ఇద్దరు యాద‌వులే కావ‌డంతో ఈ సారి ఏలూరు పార్లమెంటు సీటు నుంచి తొలిసారి యాద‌వ్ వ‌ర్గం నేత లోక్‌స‌భ‌లో అడుగు పెట్టబోతున్నారు. అయితే అది ఏ పార్టీ నుంచి అన్నదే చూడాలి.
Tags:    

Similar News