YSRCP : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..గెలుపు పై నమ్మకం లేదట
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే, వైసీపీ శ్రేణులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. జగన్ కు జనంలో ఆదరణ ఉన్నప్పటికీ, ఆయన తీసుకునే నిర్ణయాలలో స్పష్టత లేదని.. కాబట్టి పార్టీ గెలుపు అంత సులువు కాదన్నది ఆ పార్టీ నాయకులు వాదనగా ఉంది. అధికారంలో ఉన్నన్ని రోజులూ సలహాదారుల సారధ్యంలో పాలన సాగిందని.. ఆ ఫలితమే తాము 11 సీట్లకి పరిమితమైపోయామని అంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన పెత్తనమే పార్టీకి గుదిబండగా మారిందని ఆవేదన చెందుతున్నారు.
కార్యకర్తలతో చెడుగుడు ఆడుకుంటూ...
ఆ నేత జగన్‌కి అత్యంత సన్నిహితుడు. దానిని అడ్డం పెట్టుకుని వైసీపీని ఏలేస్తున్నాడు. సమన్వయకర్త పేరుతో కార్యకర్తలను చెడుగుడు ఆడేస్తు న్నాడు. జగన్ ముందు ఒకలా, నాయకుల ముందు మరోలా, కార్యకర్తల ముందు మాట్లడటాన్ని కొందరు తప్పుపడుతన్నారు. 2019 - 2024 మధ్యకాలంలో వైసీపీ అధికారంలో ఉన్న ప్పుడు అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వం లోనూ చక్రం తిప్పిన ఆయన తాను ఏం చేసినా అడిగేవారే లేరన్నట్లుగా రెచ్చిపోయాడన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సైతం డమ్మీని చేసి సర్వం తానే అన్నట్లుగా వ్యవ హరించారని, ఫలితం గత ఎన్నికల్లో పార్టీ పదకొండు సీట్లకు పడిపోయిందని, ఇంత జరిగినా అధినేత కళ్లకు గంతలు కట్టేసి ఇప్పటికీ ఆయన పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని కొందరు వైసీపీ నేతలే అంటున్నారు.
కార్యకర్త కూడా నమ్మడం లేదే...
కూటమి ప్రభుత్వ తప్పుల కారణంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో సీన్ రివర్స్ అవుతుందని, జగన్‌కు జనం జేజేలు పలికి బ్రహ్మరథం పడతారనేమాట సర్వత్రా వినిపిస్తోంది. అయినా, సగటు వైఎస్సార్‌సీపీ కార్యకర్త మాత్రం దీన్ని నమ్మడం లేదు. నాయకులకు, జగన్ మధ్య అసలు సమన్వయమే లేదని, అలాగయితే ఎలా అని లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదంటున్నారు. తమ నియోజకవర్గంలో పరిస్థితిని చెప్పుకుందామంటే వీలు లేకుండా పోయిందని వాపోతున్నారు.