Union Cabinet : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు
union cabinet meeting
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. కొన్నింటికి ఆమోదించనున్నారు. కెనాడా - భారత్ మధ్య సంబంధాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశముంది.
కీలక అంశాలపై...
దీంతో పాటు రైతులు, ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో దానికి సంబంధించి ఎటువంటి ప్రకటనలు ఉండకపోయినా జాతీయ స్థాయిలో ముఖ్య నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. దీంతో పాటు జమిలి ఎన్నికలపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశముందని తెలిసింది.