Nirmala Sitaraman : ప్రపంచ స్థాయిలో భారత్ ను అగ్రగామిగా నిలుపుతాం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

Update: 2026-02-01 05:55 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మాఘ పూర్ణిమ సందర్భంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఏడు శాతం గ్రోత్ రేట్ తో ముందుకు సాగుతున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. గ్లోబల్ మార్కెట్ తో పోటీ పడుతూ భారత్ ముందుకు సాగుతుందని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రజల ఆశలను అందుకోవడమే తమ లక్ష్యమని నిర్మలా సీతారామన్‌ వివరించారు. ఫిస్కల్ డిసిప్లిన్ ను సాధించామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ద్రవ్యోల్బణం మోడరేట్ గా ఉందని తెలిపారు.

కొత్త సంస్కరణలతో...
జనవరి నెలలో జీఎస్టీ 1.93 లక్షల కోట్ల రూపాయలను సాధించామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మూడు కర్తవ్యాలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఆర్థిక స్థిరత్వం దేశంలో కనపడుతుందని అన్నారు. ఈ బడ్జెట్ యువశక్తి బడ్జెట్ అని అన్నారు. సమ్మిళిత అభివృద్ధి, సబ్ కా సాత్ సబ్ కా వికాస్, వృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యంతో దేశాన్ని అగ్రపథాన నడిపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రధాని ఆలోచనలతో ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకు వచ్చామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. పారిశ్రమికంగా అన్ని రకాలుగా వృద్ధి రేటును నమోదు చేశామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
తమ ప్రాధాన్యతలు...
పట్టణీకరణకు కూడా తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. ఆరోగ్యరంగం కోసం బయో ఫార్మాశక్తిని అమలు చేస్తున్నామని తెలిపారు. బయో ఫార్మారంగానికి పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సంక్రమేణతర వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని చెప్పారు. ఏపీ ఒడిశా, తమిళనాడు, కేరళలో మైనింగ్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ప్రకటించారు. మూడు డెడికేడెట్ కెమికల్ పార్కుల నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలమ్మ తెలిపారు. దేశంలో రెండు హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నైపుణ్యం, పోటీ తత్వం, ఉత్పాదకతతో భారత్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లనున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.


Tags:    

Similar News