గుర్రాలపై తేనెటీగల దాడి.. రూ. 2 కోట్లు నష్టం

గుర్రాల ఆరోగ్యం విషమించి.. మృతి చెందాయి. దాంతో.. రూ. 2 కోట్ల నష్టం వాటిల్లిందని డాక్టర్ దినేశ్ వెల్లడించారు. 480..

Update: 2023-01-08 05:55 GMT

two horses killed in honey bees attack

తేనెటీగలు దాడి చేయడంతో.. ఓ గుర్రాల యజమానికి రూ.2 కోట్ల నష్టం వాటిల్లింది. తేనెటీగల దాడిలో రెండు రేసుగుర్రాలు మృత్యువాత పడ్డాయి. కర్ణాటకలోని తుముకూరు జిల్లా కుణిగల్ స్టడ్ ఫామ్‌లో జరిగిందీ ఘటన. ఫామ్ మేనేజర్ డాక్టర్ దినేశ్ ఎన్ఎం తెలిపిన వివరాల మేరకు.. తేనె టీగల దాడిలో మరణించిన గుర్రాలలో ఒక దాని వయసు 10 సంవత్సరాలు, మరొక గుర్రం వయసు 15 సంవత్సరాలు అని తెలిపారు. ఈ రెండు రేసు గుర్రాలను అమెరికా, ఐర్లాండ్ నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు.

గుర్రాలను మేత కోసం వదిలినపుడు.. వాటిపై వందలాది తేనెటీగలు జనవరి 5న దాడిచేశాయి. తీవ్రంగా గాయపడిన గుర్రాలకు పశువైద్యులు రెండ్రోజులు చికిత్స అందించినా.. ఫలితం లేకపోయింది. గుర్రాల ఆరోగ్యం విషమించి.. మృతి చెందాయి. దాంతో.. రూ. 2 కోట్ల నష్టం వాటిల్లిందని డాక్టర్ దినేశ్ వెల్లడించారు. 480 ఎకరాల్లో ఉన్న తమ ఫామ్ లో ఎక్కడా తేనెపట్టులు లేవని, చుట్టుపక్కల ఎక్కడో ఉన్న తేనెపట్టును ఎవరో కదపడంతో ఈ దాడి జరిగి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News