Earth Quake : జమ్మూకాశ్మీర్ లో భారీ భూకంపం
జమ్మూకాశ్మీర్ లో భారీ భూకంపం సంభవించింది.
జమ్మూకాశ్మీర్ లో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున బారాముల్లాలో భూకంపం సంభవించింది. నేషననల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.7 తీవ్రతతో నమోదయింది. అయితే ఈ భూకంపం భూమి అంతర్భాగంలో పది కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు అధికారులు గుర్తించారు.
నిద్ర నుంచి లేచి ఉలిక్కిపడి...
దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిద్రలో ఉండగా భూ ప్రకంపనాలు సంభవించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప కేంద్రం బారాముల్లా జిల్లాలోని పటాన్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ భూప్రకంపనలు పొరుగు దేశంలోని పాకిస్థాన్ లోనూ కనిపించింది. బారాముల్లా ప్రాంతమే కాకుండా గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతంలో కూడా భూమి కంపించింది.