రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చా?

రైలు టిక్కెట్ ఒకరి పేరు మీద బుక్ చేస్తే మరొక పేరు మీద మార్చుకునే వీలుంది

Update: 2026-02-28 03:57 GMT

రైలు టిక్కెట్ ఒకరి పేరు మీద బుక్ చేస్తే మరొక పేరు మీద మార్చుకునే వీలుంది. కన్ఫర్మ్ అయిన రైలు టిక్కెట్ లో ప్రయాణికుడి పేరు మార్చే సదుపాయం ఉంది. అయితే కొందరి పేర్లను మాత్రమే మార్చుకనే వీలుంది. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, కుమారుడు, కూతురు, భార్య భర్తలు ఈ పేర్లను మార్చుకునే విధానం రైల్వే శాఖలో ఉంది.

24 గంటల ముందే ...
ప్రయాణానికి కనీసం 24 గంటల ముందే ప్రయాణికుడి పేరును మార్చుకోవాల్సి ఉంది. టికెట్ మరియు గుర్తింపు కార్డుతో రిజర్వేషన్ ఆఫీసర్ ను సంప్రదించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, పెళ్లి బృందాలకు కూడా అవకాశం ఉంది. పేరు మార్పు ఒక్కసారి మాత్రమే అనుమతి ఉంటుందని భారతీయ రైల్వే శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News