Narendra Modi : HPV వ్యాక్సిన్ ను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశ వ్యాప్తంగా హెచ్.పి.వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశ వ్యాప్తంగా హెచ్.పి.వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు రాజస్థాన్ లోని అజ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో పాటు నివారించడానికి, కొన్ని రకాల కేన్సర్లను అరికట్టేందుకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తుంది.
బాలికలకు ఉచితంగా...
పథ్నాలుగేళ్లు నిండిన బాలికకలుకు గార్డా సిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందచేయనున్నారు. దేశ వ్యాప్తంగా ముందుగానే పథ్నాలుగేళ్ల నుంచి పదిహేనేళ్ల లోపు బాలికలను గుర్తించి వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ ను అందచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర అధికారులు చేపట్టారు.