Breaking : కోల్ కత్తాలో భూకంపం
పశ్చిమ బెంగాల్ లో భూకంపం సంభవించింది. కోల్ కత్తాలో భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
పశ్చిమ బెంగాల్ లో భూకంపం సంభవించింది. కోల్ కత్తాలో భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతగా నమోదయిందని అధికారలుు తెలిపారు. సాల్ట్ లేక్, న్యూ టౌన్, రాజర్ హాట్, బెలహారా ప్రాంతంలో ఈ భూకంప తీవ్రత కనిపించింది. దీంతో కార్యాలయాలు, ఇళ్లలో ఉన్న వారంతా భయాందోలనలతో బయటకు పరుగులు తీశారు.
భూకంప తీవ్రతతో...
అయితే భూకంప తీవ్రతతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపారు. ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ప్రసంగిస్తుండగా భూ ప్రకపంనలు కనిపించడంతో ఆయన ప్రసంగాన్ని చాలా సేపు ఆపారు. భూకంపం సంభవించిన తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇళ్లలోని వస్తువులు కూడా కింద పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.