డీఎంకేలోకి పన్నీర్ సెల్వం

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు

Update: 2026-02-27 07:55 GMT

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమిళనాట చేరికలు ఊపందుకున్నాయి. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. పన్నీర్ సెల్వం అన్నా డీఎంకేలో జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఆహ్వానించిన స్టాలిన్...
తర్వాత పన్నీర్ సెల్వం, పళని స్వామి అన్నాడీఎంకే పార్టీని తమ చేతుల్లోకి తీసుకున్నారు. పళనిస్వామి ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నీర్ సెల్వానికి పొగబెట్టారు. బీజేపీతో జతకట్టిన పళని స్వామి పన్నీర్ సెల్వం వర్గానికి పార్టీలో పదవులు ఇవ్వలేదు. దీంతో పన్నీర్ సెల్వం ప్రస్తుత అధికార డీఎంకేలో చేరారు. పన్నీర్ సెల్వంకు కండువా కప్పి పార్టీలోకి సీఎం స్టాలిన్. ఆహ్వానించారు.


Tags:    

Similar News