Breaking : ఇరాన్ పై ఇజ్రాయిల్ క్షిపణి దాడులు
ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులకు దిగింది
ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులకు దిగింది. గత ఏడాది జూన్ లో పన్నెండు రోజుల పాటు ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య దాడి జరిగింది. అయితే అమెరికా జోక్యంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. గత ఏడాది క్షిపణులు కురిపించింది. ఇరాన్ రాజదాని టెహ్రాన్ లో ఈ దాడులకు దిగింది. ఇరాన్ నుంచి తమకు ముప్పు ఉందని భావించి తాము దాడులకు దిగామని ఇజ్రాయిల్ ప్రకటించింది.
అత్యవసరమైతే తప్ప...
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ఇరాన్ ప్రభుత్వం ఆ దేశ ప్రజలను కోరింది. విద్యాసంస్థలను మూసివేసింది. ఆసుపత్రులు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలని ఆదేశించింది. మరొకవైపు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే తాము దాడులకు దిగినట్లు ఇజ్రాయిల్ అధికారికంగా ప్రకటించుకుంది. ఇరాన్ లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.