ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2026-02-27 07:43 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, మొత్తం 23మందికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే కొట్టేశామని న్యాయమూర్తి తెలిపారు.

రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పుపై...
అయితే రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సీబీఐ తెలిపింది. న్యాయమూర్తి జితేంద్ర సింగ్ 23 నిందితులను డిశ్చార్జ్ చేయడంతో దీనిపై పై కోర్టును ఆశ్రయించాలని సీబీఐ భావిస్తుంది. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు రాగానే హైకోర్టును ఆశ్రయిస్తామని సీబీఐ అధికారులు తెిపారు. ఈ కేసులో అన్ని ఆధారాలున్నాయని ఆయన అన్నారు.


Tags:    

Similar News