భారత్ - అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చలు
భారత్ - అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చలు జరగనున్నాయి.
భారత్ - అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఢిల్లీలో అమెరికా అత్యున్నత స్థాయి బృందంతో భారత్ చర్చలు జరపనుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో వెల్లడించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎగుమతులపై యాభై శాతం సుంకాలు విధించిన నేపథ్యలో ఈ చర్చలు జరుగుతున్నాయి.
అమెరికా అదనపు సుంకాలపై...
ట్రంప్ సర్కార్ విధించిన అదనపు సుంకాలు భారత్ కు భారంగా మారుతున్నాయని భావిస్తుండటంతోపాటు అమెరికాకు భారతీయ ఉత్పత్తులు గత నెలలో బాగా పడిపోయాయి. భారత్ తరుపున ఈ చర్చల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ పాల్గొంటారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను చేసుకుంటుందన్న కారణంపై ట్రంప్ సుంకాలను విధించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో నేడు భారత్ - అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయి.