గుడ్ న్యూస్... స్వల్పంగా తగ్గిన బంగారం ధర

తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

Update: 2022-08-07 02:09 GMT

బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో? పెరుగుతాయో చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతో వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. బంగారం ధర పెరిగితే ఎక్కువగానూ, తగ్గితే స్వల్పంగానూ ఉంటుంది. అందుకే ధరలను లెక్క చేయకుండా వ్యాపారాలు సాగుతున్నాయి. బంగారం ప్రతి భారతీయ ఇంట్లో ఒక వస్తువుగా మారిపోవడంతో దానిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. జనాభా ఎక్కువైన భారత్ లో బంగారానికి డిమాండ్ ఎక్కువ అని మార్కెట్ నిపుణులు చెబుతారు.

ధరలు ఇలా....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,870 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,550 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి ధర పై కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 63,000 రూపాయలుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.


Tags:    

Similar News