హైదరాబాద్ - బెంగళూరు మధ్య రెండు గంటలే ప్రయాణం
హై స్పీడ్ కారిడార్ తో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో వెళ్లవచ్చని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు
హై స్పీడ్ కారిడార్ తో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో వెళ్లవచ్చని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హై స్పీడ్ కారిడార్ తో తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య ఫైనాన్స్, హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు 5,454 కోట్ల రూపాయలను కేటాయించినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
గేమ్ ఛేంజర్ గా...
హై స్పీడ్ రైళ్లు తెలంగాణ, ఏపీకి గేమ్ ఛేంజర్ గా మారతాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, పూణె, బెంగళూరుకు మూడు హై స్పీడ్ రైళ్లు రానున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో, పూణెకు 1.55 గంటల్లో వెళ్లవచ్చని తెలిపారు. హై స్పీడ్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తాయని మంత్రి అశ్వని వైష్ణవ్ చెప్పారు.