గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

ఈరోజు మాత్రం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అదే సమయంలో వెండి ధరలు పెరగాయి

Update: 2022-11-16 03:50 GMT

బంగారం ధరలు ఎప్పడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. స్వల్పంగా తగ్గినప్పుడో, నిలకడగా ధరలు ఉన్నప్పుడో బంగారం కొనుగోలు చేయడం మేలు. కానీ కొనుగోలుదారులు మాత్రం ధరలను లెక్క చేయడం లేదు. తమ వద్ద సొమ్ములు ఉన్నప్పుడు కొనుగోలు చేయడం ఒక అలవాటుగా వినియోగదారులు మార్చుకున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి కారణాలు బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి.

వెండి ధర మాత్రం...
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు కొంత నిరాశకు గురవుతున్నారు. ఈరోజు మాత్రం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అదే సమయంలో వెండి ధరలు పెరగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,150 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 68,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News