గుడ్ న్యూస్.. పసిడిప్రియులూ ఓ లుక్కేయండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగానే తగ్గాయి. పది గ్రాములపై రూ.300లు తగ్గింది

Update: 2022-12-07 03:37 GMT

బంగారం ధరలు ఎక్కువగా పెరిగినా కష్టమే. కొనుగోలుదారులు ధరలు తగ్గేంత వరకూ వేచి చూస్తారు. తమకు నచ్చిన డిజైన్ల కోసం కూడా కొందరు వెయిట్ చేస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు బంగారం ఆభరణాల డిజైన్లను మారుస్తూ జ్యుయలరీ దుకాణాలు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ధరల పెరుగుదల, తగ్గుదల వారి చేతిల్లో ఏమీ లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలో బంగారం ధరల్లో పెరుగుదల, తగ్గుదల కనిపిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇటీవల కాలంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అందించాలన్న కారణంతో బంగారం దిగుమతులు కూడా దేశంలో ఎక్కువయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

తగ్గిన బంగారం ధరలు...
వరసగా బంగారం ధరలు పెరుగుతుండటం కొంత వినియోగదారులను నిరాశపర్చింది. దాదాపు వెయ్యి రూపాయలకు పైగానే నాలుగైదు రోజుల్లో పెరిగింది. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగానే తగ్గాయి. పది గ్రాములపై రూ.300లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,780 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,300 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 70,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News