గుడ్ న్యూస్.. ధరలు తగ్గాయ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే.

Update: 2022-11-22 03:31 GMT

gold, silver, hyderabad

బంగారం ధరలు ఏ రోజు కారోజు పరుగుతుంటాయి. తగ్గుతుంటాయి. బంగారం ధరల కోసం అనేక మంది ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచంలోనే బంగారం కొనుగోళ్లలో భారత్ రెండో స్థానంలో ఉంది. బంగారాన్ని అధికంగా ఇష్టపడే వారు భారత్ లో ఎక్కువగా ఉన్నారు. అందుకే రెండో స్థానానికి చేరుకుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు బంగారం ధరల్లో హెచ్చు తగ్గుదలకు కారణాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. మరోవైపు బంగారాన్ని పొదుపు చేసే వారు ఎక్కువగా ఈ మధ్య కాలంలో కనపడుతుంది. అందుకే బంగారం ధర పెరిగినా, తగ్గినా వినియోగదారులు పెద్ద గా పట్టించుకోవడం లేదు.

వెండి కూడా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,920 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,500 రూపాయలుకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 66,500 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News