గోల్డ్ .. ఇప్పుడే కొంటే మేలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు

Update: 2022-08-15 01:55 GMT

బంగారానికి ఎప్పుడూ విలువే. దానికి మెరుపునకు తగినట్లుగానే విలువ కూడా ఎప్పుడూ తగ్గదు. బంగారం అంటే ఇష్టపడని ఏ మహిళ బహుశ భారతదేశంలో ఉండదు. ప్రతి మహిళ తన ఒంటి మీద, ఇంట్లోనూ బంగారం ఉండాలని భావిస్తుంది. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్. బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నా పెద్దగా కేర్ చేయరు. అందుకు కారణం. దానికి పెరగడమే కాని తగ్గడం తెలియదు. బంగారం భారతీయ సంస్కృతిలో ఒక భాగమయి పోవడంతో దాని డిమాండ్ కు సరిపడా జ్యుయలరీ షాపులు ఎక్కడికక్కడ వెలుస్తున్నాయి.

స్థిరంగా ధరలు...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. అందుకే ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడానికి మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 52,329 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,150 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 64,800 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News