పది మంది మంత్రులకు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా

మహారాష్ట్రలో పదిమంది మంత్రులకు, ఇరవై మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

Update: 2022-01-01 06:26 GMT

మహారాష్ట్రను అటు కరోనా, ఇటు ఒమిక్రాన్ వణికిస్తుంది. ఒక్క మహారాష్ట్రలోనే 450కి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరోసారి మహారాష్ట్రపై పగపట్టినట్లే కన్పిస్తుంది. పదిమంది మంత్రులకు, ఇరవై మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారినపడటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. కఠిన ఆంక్షల దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది.

ఆసుపత్రుల్లో చేరే వారి....
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పంది మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. దీంతో పాటు నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 8,067 కరోనా కేసులు నమోదయ్యయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా విస్తరిస్తుంది. కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే సామూహిక కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.


Tags:    

Similar News