వెల్లింగ్టన్ నుంచి భౌతిక కాయాలు తరలింపు

వెల్లింగ్టన్ గ్రౌండ్స్ లో ఉన్న ఆర్మీ అధికారుల మృతదేహాలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాళులర్పించారు.

Update: 2021-12-09 06:54 GMT

వెల్లింగ్టన్ గ్రౌండ్స్ లో ఉన్న ఆర్మీ అధికారుల మృతదేహాలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాళులర్పించారు. ఆయన అక్కడ ఆర్మీ అధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు 11 మంది ఆర్మీ అధికారులకు స్టాలిన్ నివాళులర్పించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఒక సమర్థవంతమైన అధికారిని భారత్ కోల్పోయిందన్నారు.

ప్రత్యేక విమానంలో....
కాగా వెల్లింగ్టన్ నుంచి ఆర్మీ అధికారుల మృతదేహాలను తరలించే ఏర్పాట్లు ప్రారంభమయ్మాయి. ఆర్మీకి చెందిన ప్రత్యేక వాహనంలో ఎయిర్ పోర్టుకు తీసుకు వెళుతున్నారు. అక్కడి నుంచి ఆర్మీ విమానంలో ఢిల్లీకి తీసుకువస్తారు. వెల్లింగ్టన్ లో క్లాస్ చెప్పాల్సిన రావత్ ఇలా మరణించడం పట్ల అక్కడ అధికారులుకూడా తట్టుకోలేకపోతున్నారు. ఆయనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.


Tags:    

Similar News