ముగిసిన పాక్ - ఇండియా చర్చలు

ఇండియా - పాకిస్తాన్ ల మధ్య చర్చలు ముగిశాయి

Update: 2025-05-12 12:54 GMT

ఇండియా - పాకిస్తాన్ ల మధ్య చర్చలు ముగిశాయి. రెండు దేశాలకు చెందని సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ చర్చలు ముగిశాయి. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయిన చర్చలు నలభై నిమిషాలు జరిగినట్లు చెబుతున్నారు. హాట్ లైన్ ద్వారా రెండు దేశాలకు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ లు చర్చించుకున్నారు.

కాల్పులు విరమణ ఒప్పందం...
ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడంతో పాటు దాని కొనసాగింపు,ఉద్రికత్తల తగ్గింపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. నిజానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకే చర్చలు జరగాల్సి ఉండగా, పాక్ అభ్యర్థన మేరకు సాయంత్రం ఐదు గంటలకు వాయిదా పడ్డాయి. భారత్ తరుపున డీజీఎంో రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంో మేజర్ జనరల్ కాశిఫ్ చైదురి పాల్గొన్నారు.


Tags:    

Similar News